క‌న‌క‌దుర్గ‌మ్మ ఆశీస్సుల‌తో ప్ర‌జ‌లంద‌రూ సుఖ‌సంతోషాల‌తో వుండాలి

ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి కేశినేని జానకిలక్ష్మి, కుమారుడు వెంకట్..

(విజయవాడ, ఆంధ్రప్రభ) : కనకదుర్గమ్మ వారి కరుణాకటాక్షాలతో అందరం సుఖ సంతోషాలతో ఉండాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్‌ (MP Keshineni Sivanath) సతీమణి జానకి లక్ష్మి తనయుడు వెంకట్ ఆకాంక్షించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని బాలా త్రిపుర సంద‌రి దేవి అలంకారంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి జానకిలక్ష్మి, తనయుడు వెంకట్ సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అమ్మవారి కటాక్షం, ఆశీర్వాదం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలపై ఉండాలని ప్రార్థించారు. ఆల‌యానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి జాన‌కి ల‌క్ష్మీ, కుమారుడు వెంక‌ట్ కు ఆలయ అధికారులు, అర్చకులుస్వాగతం పలికారు.అమ్మ‌వారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంతరం వేద ఆశీర్వ‌చన మండ‌పంలో తీర్థ‌ప్ర‌సాదాలు అందుకున్నారు.

మరింత శోభ తెచ్చేలా విజయవాడ ఉత్సవ్…
దసరా శరన్నవరాత్రులకు మ‌రింత శోభ తెచ్చే విధంగా విజయవాడలో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ విజయవంతం కావాలని, నగర ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు జానకి లక్ష్మి, వెంకట్ తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం తమకు ఒక అదృష్టమని ఎంపీ కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. విజయవాడ ఉత్సవ ఈసారి అందరికీ మధురానుభూతిని మిగిలుస్తుందని తెలిపారు.

Leave a Reply