ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ఖలిస్తానీ ఉగ్రవాది, గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ బాడీగార్డ్ ఇంద్రజీత్ సింగ్ గోసల్ కెనడాలో అరెస్టు అయ్యాడు. 2023 జూన్‌లో హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం తర్వాత ఇంద్రజీత్ సింగ్ గోసల్ అమెరికా ఆధారిత ఖలిస్తానీ సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ)కు ప్రధాన సంస్థాపకుడిగా కొనసాగుతున్నాడు. ఈ మేరకు అతడిని భారీగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగంతో ఒట్టావాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ సంవత్సరంలో ఇంద్రజీత్ సింగ్‌ను కెనడా పోలీసులు అరెస్ట్ చేయడం రెండోసారి.
కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏ,ఏఏఐబీలకు సుప్రీం నోటీసులు
గత సంవత్సరం నవంబర్‌లో గ్రేటర్ టొరంటో ఏరియా (జీటీఏ)లోని ఒక హిందూ దేవాలయంలో జరిగిన హింసాత్మక సంఘటనకు సంబంధించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ అతను హిందూ, కెనడియన్ భక్తులపై దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే, పీల్ రీజనల్ పోలీస్ (PRP) అతనికి షరతులతో కూడిన బెయిల్‌ను ఇటీవలే మంజూరు చేసింది. ఆ సమయంలోనే పోలీసు అధికారులు ఇంద్రజీత్ గోసల్ కెనడాలో ఖలిస్తాన్ రిఫరెండం యొక్క ప్రధాన సంస్థాపకుడిగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. గోసల్ భారత్‌లో నిషేధిత సంస్థ అయిన ఎస్‌ఎఫ్‌జే జనరల్ కౌన్సెల్ అయిన ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ రైట్ హ్యాండ్‌గా పేరుంది. అతడు పన్నూన్ బాడీ డీగార్డ్‌గా కూడా పనిచేశాడు.