రోడ్లు జలమయం

  • వాహనదారుల ఇబ్బందులు..

హైదరాబాద్‌లో మళ్ళీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షంతో నగర రహదారులన్నీ నీటమునిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్ప‌డింది.

అంబర్‌పేట్, కాచిగూడ, నారాయణగూడ, బర్కత్‌పూర్, నల్లకుంట, ఉప్పల్, రామాంతపూర్, కాప్రా, జవహర్‌నగర్, ECIL, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, చాంద్రాయణగుట్ట, తార్నాక, మల్కాజ్‌గిరి, మౌలాలి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట‌, బంజారాహిల్స్, మాదాపూర్ త‌దిత‌ర ప్రాంతాలు వర్ష ప్రభావంతో నీటమునిగిపోయాయి.

ఇక ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు కాలనీలు, వీధులు చెరువులను తలపించగా, కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.

Leave a Reply