టేకుమట్ల , ఆంధ్రప్రభ : రైతులకు యూరియా(Urea) కష్టాలు తీరడం లేదు. భూపాలపల్లి(Bhupalpalli) జిల్లా టేకుమట్ల(Tekumatla) మండలంలోని బోర్నపల్లి(Bornapally) గ్రామ రైతు వేదిక(Farmer’s platform) వద్ద యూరియా బస్తాల టోకెన్(Token) ల కోసం వర్షాన్ని లెక్కచేయకుండా తెల్లవారుజామున నుండి చెప్పులు లైన్లో పెట్టి మంగళవారము ఎదురు చూస్తున్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు గాసిన యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా(Urea)ను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు.

