ఇదే ప్రధాన లక్ష్యం

  • జవాబుదారీతనం
  • పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు

నరసరావుపేట, ఆంధ్రప్రభ : నూతన ఎస్పీబీ. కృష్ణారావు(B. Krishna Rao) ఆదివారం పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ.. నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ(Maintenance of Law and Order), ప్రజలకు వేగంగా న్యాయం అందించే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

పోలీసు శాఖ(Police Department)లో క్రమశిక్షణ, జవాబుదారీతనం, పారదర్శకత, ప్రజా సమస్యలపై మరింత దృష్టి సారించి, పోలీస్ శాఖ పట్ల ప్రజలకు సానుకూల వాతావరణాన్నికల్పించేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని(Technology) ఉపయోగించి నేర నియంత్రణకు కృషి చేసేందుకు తగిన చర్యలు చేపడతామని తెలిపారు.

Leave a Reply