యువకుడి ఆత్మహత్య

జగిత్యాల : జిల్లాలోని వెల్గటూర్ మండలం ముత్తునూర్ (Muthunur) లో విషాదం చోటుచేసుకున్నది. వెల్గటూర్ మండలంలోని ముత్తునూర్ గ్రామానికి చెందిన సంఘ శరత్ (24) అనే యువకుడు శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.

ఉరేసుకునే ముందు గ్రామంలోని పలువురి దోస్తులకు ఫోన్ (Phone) ద్వారా చనిపోతున్నట్లు మెసేజ్ చేసాడు. సమాచారం అందుకున్న యువకులు మృతుని వద్దకు వెళ్ళే సరికే యువకుడు ఉరేసుకుని మృతి చెందాడని తెలిపారు. అయితే ప్రేమ వ్యవహారమే అత‌ని మృతికి కారణమని గ్రామంలో చర్చించుకోవడం చర్చనీయాంశంగా మారింది.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

Leave a Reply