జిల్లా ఎస్పీకి రైత‌న్న‌ల మెప్పు..

జిల్లా ఎస్పీకి రైత‌న్న‌ల మెప్పు..

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మనమంతా ఒక్కటే.. మనందరం రైతన్నల(Farmers) కొరకేనని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామ్ నాథ్ కేకన్(Ram Nath Kekan) అన్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కొరకు రైతులు బారులు తీరారు.

ఈ క్రమంలో అక్కడ కాపలాగా విధులు నిర్వహించడానికి బందోబస్తు(Bandobast)గా వచ్చిన ఓ పోలీస్ సీఐ ఒకరు హమాలీలపై దురుసుగా దుర్భాషలాడారు. దీంతో హమాలీ(Hamali) కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నానిర్వహించారు.

విషయం తెలుసుకున్నజిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ హుటాహుటిన వెంటనే వారి వద్దకు వచ్చి మనమంతా ఒక్కటేననీ, మనందరం పని చేసేది రైతన్నల కోస‌మేన‌ని పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుందామని కార్మిక సంఘం(Labor Union) అధ్యక్షుడు మల్లయ్యతో చేయి కలిపి సమర్ధించుకున్నారు.

ఈ సందర్భంగా హమాలీ కార్మికులు నిరసన విరమించి మళ్లీ పనిలోకి(Back to Work) చేరారు. యూరియా పంపిణీలో జిల్లా ఎస్పీ పాత్ర(Role) బాగుందని రైతన్నలు మెచ్చుకుంటున్నారు.

Leave a Reply