యూరియా కోసం యాత‌న‌

ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : యూరియా (Urea) వెత‌లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో రైతుల్లో ఆందోళ‌న మ‌రింత పెర‌గుతున్నాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ (Telangana) లో రైతులు తిర‌గ‌ప‌డుతున్నారు. సిద్దిపేట (Siddipet) మండ‌లం ఇర్కోడ్ గ్రామంలో యూరియా అడిగిన రైతును అరెస్టు చేయ‌బోయిన పోలీసుల‌ను రైతులు అడ్డుకున్నారు.

ఒకానొక ద‌శ‌లో తిర‌గ‌బ‌డ్డారు. వెంట‌నే పోలీసులు (police) శాంతించి అరెస్టు చేయ‌కుండా విడిచిపెట్టారు. అప్పుడు రైతులు (Farmers) శాంతించారు. ఉమ్మ‌డి మెద‌క్ (Medak) జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు.

Leave a Reply