నల్గొండ, ఆంధ్ర ప్రభ : మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గంజాయి (Ganja) రవాణాపై జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sharath Chandra Pawar) అన్నారు. గంజాయిపై నిరంతర నిఘా పెడుతున్నట్లు చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో 18 కేసుల్లో 207.056 కేజీల గంజాయి, 118 గంజాయి చెట్లు, 173 మత్తు టాబ్లెట్స్ సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం జనావాసానికి దూరంగా ఉన్న నార్కట్ పల్లి మండలం (Narkatpalli Mandal) గుమ్మల బావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ లో ఈరోజు నిర్వీర్యం చేశామన్నారు. జిల్లా పరిధిలో గంజాయి (Ganja), డ్రగ్స్ (Drugs) రవాణా వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నామని పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నంబర్ 8712670266 కి సమాచారం తెలపాలని కోరారు.

