హైదరాబాద్, ఆంధ్రప్రభ: గ్రూపు వన్ రిక్రూట్మెంట్ ద్వారా కాంగ్రెస్(Congress) రూ. 1700 కోట్ల స్కామ్ చేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్(Former Minister R.S. Praveen Kumar) ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదిక(X platform)గా ఆయన మండిపడ్డారు.
ఒక్కో పోస్టును రూ. 3 కోట్లకు అమ్ముకుంటూ, నిరుద్యోగుల(of the unemployed) జీవితాలతో చెలగాటమాడారు అని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల కేటాయింపుల దగ్గరి నుంచి హాల్‌టికెట్ల జారీ, పేపర్ల మూల్యాంకనం వరకు… ప్రతీ దశలోనూ కాంగ్రెస్ అవినీతి మార్క్ కనిపించిందని విమర్శించారు.
నిరుద్యోగుల భవిష్యత్తును బజార్లో అమ్ముకున్న ఈ ‘స్కాంగ్రెస్’ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి తెలంగాణ యువత సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.