టెక్ ఔత్సాహికులు, ఆపిల్ ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం చివరకు రానే వచ్చింది. ఆపిల్ కంపెనీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో న్యూ ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది.
ఈసారి “Awe Dropping” పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమం… సెప్టెంబర్ 9 (మంగళవారం) ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30) కుపర్టినోలోని ప్రధాన కార్యాలయం నుంచి లైవ్‌గా ప్రసారం కానుంది.
ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణ – iPhone 17 సిరీస్ !
ఈవెంట్లో iPhone 17 సిరీస్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ సిరీస్‌లో నాలుగు మోడళ్లు ఉండనున్నాయి:
iPhone 17 – 6.3 అంగుళాల డిస్ప్లే.
iPhone 17 Air – “Plus” మోడల్‌కి బదులుగా వస్తోంది. ఇప్పటివరకు అత్యంత సన్నగా ఉన్న iPhone (దాదాపు 5.5mm) ఇదే అవుతుంది.
iPhone 17 Pro & Pro Max – కొత్త “హారిజాంటల్ కెమెరా ఐలాండ్” డిజైన్. A19 Pro చిప్, 12GB RAM ఉంటాయి. Pro Maxలో 48MP టెలిఫోటో లెన్స్ (8x ఆప్టికల్ జూమ్), అలాగే 5000mAh బ్యాటరీ.
🔹 అన్ని మోడళ్లలో ఫ్రంట్ కెమెరా 12MP నుండి 24MP కి అప్‌గ్రేడ్ అవుతుంది.
🔹 120Hz ProMotion OLED డిస్ప్లేలు అన్ని మోడళ్లలో అందుబాటులో ఉంటాయి.
ఇతర ఉత్పత్తులు
Apple Watch Series 11 – ప్రకాశవంతమైన స్క్రీన్, కొత్త చిప్, కొత్త రంగులు. రక్తపోటు కొలిచే ఫీచర్ కూడా ఉండొచ్చు.
Apple Watch Ultra 3 – పెద్ద స్క్రీన్, శాటిలైట్ కనెక్టివిటీ (నెట్వర్క్ లేకపోయినా మెసేజ్ పంపే అవకాశం), కొత్త S11 చిప్.
AirPods Pro 3 – కొత్త డిజైన్, కొత్త H3 చిప్. శబ్ద నియంత్రణ ఇంకా మెరుగ్గా ఉంటుంది. హార్ట్ రేట్, బాడీ టెంపరేచర్ కొలిచే సెన్సర్లు ఉండొచ్చు.
iOS 26 – కొత్త iPhones ఇవే నడిపిస్తాయి. ఇందులో AI ఆధారిత కొత్త ఫీచర్లు, “Liquid Glass” అనే కొత్త డిజైన్ ఉంటాయి. కొత్త iPhones iOS 26, AI ఆధారిత కొత్త ఫీచర్లు, అలాగే కొత్త “Liquid Glass” డిజైన్ ఉంటుందని అంచనా.