కృష్ణా ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్: పామర్రు(Pamarru) నాలుగు రోడ్ల సెంటర్ లో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్(Short circuit) తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పామర్రు జనసేన ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్(Tadisetti Naresh) స్వీట్ షాప్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. నిత్యం రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలిలో అగ్ని ప్రమాదం జరగడంతో పరిసర దుకాణదారులు బితిల్లారు.
తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో రెండు ప్రమాదం తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకొని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల విలువైన ఫర్నిచర్(Furniture worth Rs. 15 lakhs) పూర్తిగా దగ్ధమైనట్లు నరేష్ కుటుంబంలో వర్గాలు తెలిపాయి. 75 ఏళ్లుగా తాడిశెట్టి మిఠాయి దుకాణం పామర్రు పరిసర ప్రాంత ప్రజలకు సుపరిచితం. ఘటన విషయాలు తెలుసుకున్న కూటమి నాయకులు జనసేన ఇంఛార్జ్ నరేష్(Tadisetti Naresh) కు ఫోన్లు చేసి విషయం తెలుసుకుంటున్నారు.

