వేములవాడ, ఆంధ్రప్రభ : చంద్ర గ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి(Sri Raja Rajeswara Swamy) (రాజన్న) వారి ఆలయం కవాట బంధనం చేశారు. ఈ రోజు ఉదయం గం11-25 నిమిషాలకు వరకు అన్నిఆర్జిత సేవలను ముగించి, దర్శనాలు నిలిపి వేశారు.
అనంతరం కవాట బంధనం చేశారు. రాజన్న ఆలయ ప్రధాన ద్వారానికి ఆలయ అధికారులు(Officers) అర్చకుల సమక్షంలో తాళం వేశారు. తిరిగి సోమవారం గ్రహణ మోక్షకాలం అనంతరం తెల్లవారు జామున గం.3-45 నిమిషాలకు తర్వాత సంప్రోక్షణ జరిపిన తదుపరి మంగళ వాయిద్యాలు, సుప్రభాతం అనంతరం ప్రాతఃకాల పూజ(morning worship) జరిపి భక్తుల దర్శనం, నిత్య విధులు యథావిధిగా నిర్వహిస్తామని ఆలయ ఇన్చార్జి ఈవో రమాదేవి తెలిపారు. అనుబంధ ఆలయాలు మూసివేశారు.
శ్రీ మహాశక్తి దేవాలయం మూసివేత
కరీంనగర్, ఆంధ్రప్రభ : నగరంలోని శ్రీ మహాశక్తి దేవాలయం(Sri Mahashakti Temple) కవాట బంధనం చేశారు. ఉదయం అమ్మవార్లకు పూజలు నిర్వహించి నివేదన అనంతరం ఆలయ అర్చకులు మూసివేశారు. తిరిగి రేపు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం ఉదయం ఆరు గంటల నుండి దర్శనాలకు అనుమతి(Permit) ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

