వరంగల్ , ఆంధ్రప్రభ : వరద నీటిలో బస్సు చిక్కుకుంది. సమాచారం అందుకున్న ఇంతేజార్ గంజ్ ఇన్స్ స్పెక్టర్ అక్కడి కి చేరుకొని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో అంతా ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
వరంగల్(Warangal) నగరంలో కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షం(heavy rain) కారణంగా వరంగల్ అండర్ బ్రిడ్జి(Underbridge) కింద భారీగా వర్షం నీరు చేరుకుంది. ఒక్కసారిగా చేరుకున్నవరద నీటిలో బస్సు చిక్కుకుంది. ప్రయాణికులు సమాచారం మేరకు ఇంతేజార్ గంజ్ ఇన్స్ స్పెక్టర్ షుకూర్(Intezar Ganj Inspector Shukur) తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. తాళ్ల సహాయంతో ప్రయాణికులకు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

