ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లోని ప‌లు జిల్లాలో ఇవాళ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ (Meteorological Department) వెల్ల‌డించింది. జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally), కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాలలోని చాలాచోట్ల ఈదురుగాలుల వ‌ర్షం ప‌డే చాన్స్ ఉండ‌టంతో ఎల్లో అలెర్ట్ (Yellow Alert) జారీ చేసింది. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిస్తాయని ఆరెంజ్ అలెర్ట్ తో హెచ్చరించింది.

ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి – కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్‌లలో సాయంత్రం -అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు హైదరాబాద్(Hyderabad)తో సహా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు (Rains) పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Leave a Reply