ఉట్నూర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క (Atram Sugunakha), ఆదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ (Janardhan Rathod) అన్నారు. ఈరోజు శ్రీ సేవా ఫౌండేషన్ డైరెక్టర్ రాథోడ్ గణేష్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని (Mega Blood Donation Drive) నిర్వ‌హించారు. రక్తదానం చేసిన యువ దాతలకు సభ్యులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

ఈసందర్భంగా ఆత్రం సుగుణక్క, జనార్దన్ రాథోడ్ లు మాట్లాడుతూ.. ర‌క్త‌దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాల‌ని యువ‌త‌కు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో మహిళలు, బాలికలకు రక్తం లేక చాలా బాధ పడుతున్నారని, అలాంటి వారికి ఈ ఇచ్చే రక్తం చాలా అవసరం అవుతాయన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫౌండేషన్ చైర్మన్ జాదవ్ వసంత్ రావు, గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు నేతావత్ రాందాస్, డాక్టర్ కపిల్ కుమార్, డాక్టర్ మహేందర్, శ్రీ సేవా ఫౌండేషన్ వైస్ చైర్మన్ జాదవ్ ప్రభాకర్, అధ్యక్షులు చవాన్ సేవాదాస్, ప్రధాన కార్యదర్శి బానోత్ రవీందర్, జాయింట్ సెక్రటరీ చవాన్ కిర‌ణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply