ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ఇందిరమ్మ ఇండ నిర్మాణంలోను చేతులు తడపందే బిల్లులు మంజూరు కావడం లేదు. మంచిర్యాల (Mancherial) జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడిలో ఓ పేద కుటుంబానికి ఇటీవలే ఇల్లు మంజూరైంది. పునాదులు దాటి గోడలు, స్లాబ్ నిర్మాణ దశకు చేరుకోగా రూ.లక్షా 50వేల బిల్లు మంజూరి కోసం గ్రామ కార్యదర్శి వెంకటస్వామి రూ.20వేలు డిమాండ్ చేశాడు. చేసేదేం లేక బాధితుడు ఏసీబీ అధికారుల (ACB officials) ను ఆశ్రయించాడు.

మంచిర్యాల డీఎస్‌పీ మధు ఆధ్వర్యంలో వల పన్ని బాధితుడు రూ.20వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ (Red-handed) గా ఈ రోజు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకొని నిందితుడిని కరీంనగర్ ఏసీబీ కోర్టు (Karimnagar ACB Court) కు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో గడచిన నెల రోజుల్లోనే ఇద్దరు కార్మిక శాఖ అధికారులు, వైద్యశాఖలో సూప‌ర్‌వైజ‌ర్‌, గ్రామపంచాయతీ కార్యదర్శి మొత్తం నలుగురు ఏసీబీ (ACB) కి పట్టుపడడం గమనార్హం.

Leave a Reply