కుటుంబానికి అండగా నిలిచిన మిత్ర బృందం

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ : మిత్రుడు తమ నుండి దూరమైనప్పటికీ ఆ మిత్రుడి కుటుంబం ఇబ్బందుల పాలు కాకుండా అండగా నిలవాలని తలంచారు మిత్రబృందం సభ్యులు. అనుకున్నది తడువుగా తలా కొంత జమ చేసి తమ మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సంఘటన నారాయణ పేట జిల్లా మ‌క్త‌ల్‌(Makthal, Narayanapet district)లో చోటుచేసుకుంది.

మక్తల్ మండలం(Maktal Mandal)లోని పంచలింగాల గ్రామానికి చెందిన మహదేవ్(Mahadev) గత ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. పదవ తరగతి(10th class) వరకు తమతో కలిసి చదువుకున్నతమ మిత్రుడు మృతి చెందడంతో కుటుంబం పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని ఇవాళ పంచలింగాల గ్రామాని(Panchalingala Village)కి వెళ్లి తమ మిత్రుడు మహదేవ్ కుటుంబ సభ్యులకు మక్తల్ పదవ తరగతి మిత్రబృందం ఆర్థిక సహాయం అందజేశారు.

ఇకముందు కూడా వారి కుటుంబ సభ్యులకు ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటామని మహదేవ్ మిత్ర బృందం(Mahadev Mitra Group) మిత్రుడి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇది కదా మితృత్వం అంటే. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం సభ్యులు గోవర్ధన్, అంజి, రామలింగం, రాజు, తిమ్మప్ప, నరసింహ, రాము, గోవిందు, చెన్నప్ప, వెంకటేష్, జనార్ధన్, జగదీష్ ,నర్సింహ, వెంకటేష్, తదితరులు ఉన్నారు.

Leave a Reply