నలుగురిపై కేసు నమోదు.. ఒకరి అరెస్ట్ !!
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కర్ణాటక బీదర్ నుంచి నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్ననల్లబెల్లాన్నిదేవరకొండ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం(Excise Enforcement Team) పట్టుకున్నారు. దేవరకొండ ప్రాంతానికి తరలిస్తున్నడీసీఎం వ్యానును నల్లగొండ జిల్లా చెన్నారం ఎక్స్ రోడ్(Chennaram X Road) కొండపల్లి దేవరకొండ ప్రాంతంలో దేవరకొండ ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఎస్ శ్రీనివాస్(Enforcement CI S Srinivas), ఎస్ఐ నరసింహ, కానిస్టేబుల్ శేఖర్, నాగరాజు, అనిల్ కుమార్ కలిసి బెల్లం వ్యాన్ని పట్టుకున్నారు.

6000 కేజీల బెల్లం, 300 కేజీల ఆలం పట్టి(seized 6000 kg jaggery, 300 kg alam), ఒక సెల్ ఫోను, డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గుంటూరుకు చెందిన కే. చంద్రపాల్, బీదర్ కర్ణాటక చందన వ్యక్తులుగా ఆంగోతు రమేష్, తరుణ్, నారాయణల పై కేసు నమోదు చేశారు. పట్టుకున్నబెల్లం, డీసీఎం వాహనం కలిపి రూ.10 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు. వీరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. బెల్లం వాహనాన్ని స్వాదీనపరుచుకున్న ఎన్ఫోర్స్మెంట్ టీంను నల్లగొండ డిప్యూటీ కమిషనర్ ఏ శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులు అభినందించారు.
