రూ.1.50 ల‌క్ష‌ల విలువైన డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

రాజ‌మండ్రికి చెందిన ముగ్గురు అరెస్టు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మ‌ల్క‌జ్‌గిరి ఎక్సైజ్ స్టేషన్(Malkajgiri Excise Station) పరిధిలో నారపల్లి ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారం మేరకు డీటీఎఫ్‌ టీం సీఐ భరత్ భూషణ్(DTF Team CI Bharat Bhushan), ఎస్సై శ్రీనివాసరెడ్డి(SI Srinivasa Reddy) బృందం కలిసి ఈ రోజు దాడులు నిర్వ‌హించి 31 గ్రాముల ఎండి, డ్రగ్స్(Drugs, 31 grams of MD, Drugs) ప‌ట్టివేశారు.

పోలీసులు ప‌ట్టుకున్న డ్ర‌గ్స్ విలువ రూ.1.50 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచనా వేశారు. డ్రగ్స్ (Drugs)తో పాటు మూడు సెల్ ఫోన్లు, ఒక బైకును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి రాజమండ్రికి చెందిన డానియల్ రాజు, అభిరామ్, అభిషేక్ వర్మలను అరెస్టు చేశారు. అరెస్ట‌యిన నిందితుల‌ను మ‌ల్కాజిగిరి పోలీసు స్టేష‌న్‌కు అప్ప‌గించారు.

Leave a Reply