హైదరాబాద్ , ఆంధ్రప్రభ బ్యూరో : ఇండియా కూటమి (Alliance of India) ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy) ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్(Hyderabad)కు వస్తున్నారని కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి (Mallu Ravi) తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport)లో ఆయనకు కాంగ్రెస్ ఎంపీ లు నాయకులు స్వాగతం పలుకుతారని తెలిపారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్ (Banjara Hills)లోని తాజ్ కృష్ణ హోటల్ (Taj Krishna Hotel)లో సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీలు హాజరు కావాలని కోరారు.
హైదరాబాద్కు నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాక
