సరికొత్త హంగులతో నవ్య నూతనంగా..

కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌తో కలిసి లక్ష్మీపురంలో పీఏసీఎస్‌ భవనం ప్రారంభం
వైభవంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : పెరుగుతున్న పోటీకి తోడు, విస్తరిస్తున్నకార్పొరేట్ బ్యాంకింగ్ (Corporate Banking) రంగాన్నితలద‌న్నేలా పరపతి సంఘాలు పనిచేస్తున్నాయని కేడీసీసీ (KDCC) చైర్మన్, మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం (Nettem Raghuram) పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధికి చిరునామాగా పీఏసీఎస్ (PACS)లు నిలుస్తున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్‌లో సరికొత్త హంగులతో నవ్య నూతనంగా వినియోగదారులకు సరికొత్త సేవలను అందిస్తున్నట్లు చెప్పారు.

ఎన్టీఆర్జి జిల్లాలోని తిరువూరు(Thiruvur) నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో అత్యాధునిక హంగులతో కొత్తగా రూపొందించిన పీఏసీఎస్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు(Kolikapudi Srinivasa Rao)తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్‌పర్సన్‌గా కె.ప్రమీలతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్ష్మీపురం పరపతి సంఘం 24 కోట్ల రూపాయల లావాదేవీలను నిర్వహించడంతోపాటు కోటి రూపాయలకు పైగా డిపాజిట్లను కలిగి ఉండడం విశేషం అన్నారు. ఈ సంఘం ఆధ్వర్యంలో ధాన్యం వ్యాపారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని సదుపాయాల కల్పనలో భాగంగా సరికొత్త గోడౌన్‌(Godown)తో పాటు అన్ని మౌలిక సదుపాయాలతో కొత్త భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

కొలికపూడి ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి
అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా అమరావతి రాజధాని కలల సహకారంలో కొలికపూడి శ్రీనివాసరావు పాత్ర ఎనలేనిదని నెట్టెం రఘురాం పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కష్టమొస్తే ముందుండే వ్యక్తి కొలికపూడి అని, అలాంటి వ్యక్తి ఈ రోజున తిరువూరు శాసనసభ్యుడిగా ప్ర‌జ‌లంద‌రి అభిమానాన్ని చూరగొన్నార‌ని చెప్పారు. కొలికపూడి అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే కొలికపూడి అని అన్నారు. ఆయన ఏడాది కాలంలో తిరువూరు నియోజకవర్గం కొలికపూడి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

రైతు లేని సమాజం ఊహించ‌లేం..
నాడు.. నేడు.. ఎప్పుడైనా రైతులేని సమాజాన్ని ఊహించడం సాధ్యం కాదని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతుకు సహకారం ఎంతో అవసరమని, ఇందులో పరపతి సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు. రైతులతో పాటు టూవీలర్ ఆటో లారీ కమర్షియల్ (Two Wheeler, Auto, Lorry Commercial) వాహనాలకు కూడా రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. హోమ్ లోన్స్ (Home Loans)తోపాటు ఇంటి రిపేర్ కోసం, మార్ట్‌గేజ్ (Mortgage)లోన్లు వ్యాపారం ఎడ్యుకేషన్(Education) లోన్లు ఇలా అన్నింటినీ పరపతి సంఘాలు అందించడం అభినందనీయమన్నారు. నేటి ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న పరిపతి సంఘాలు రానున్న రోజులలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కొనియాడారు.

Leave a Reply