- భద్రాచలం వద్ద పెరుగుతున్న నీరు
భద్రాచలం : గోదావరి (Godavari) పరవళ్లు తొక్కుతున్నాయి. భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి క్రమంగా పెరుగుతుంది. ఇంద్రావతి, ప్రాణహిత (Pranahita) వంటి ఉప నదులు పొంగి ప్రవహిస్తుండటం, మరో వైపు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి గంట గంటకు పెరుగుతోంది. గురువారం ఉదయం నుంచి 10 గంటలకు 8 అడుగుల మేరకు నీటిమట్టం పెరిగింది. రామగుండం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక 73.32 అడుగులకు చేరింది.

సమ్మక్క సాగర్ (Sammakka Sagar) బేరేజ్ వద్ద 59 గేట్లు ఎత్తి 5,20,383 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు (TaliperuProject) కు అధిక నీరు చేరుతుండటంతో 24 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి కూడా 5 వేల క్యూసెక్కుల వరద నీరు చేరడంతో ఒక గేట్ ఎత్తి ఉంచారు. వరద ఇలాగే కొనసాగితే మరోసారి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.