టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో మరో గొప్ప మైలురాయిని సాధించారు. ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ – లండన్ బాలకృష్ణకు అరుదైన గౌరవాన్ని అందించింది.
భారతీయ సినీ పరిశ్రమలో 50 ఏళ్లుగా కథానాయకుడిగా నిరంతరం చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా బాలకృష్ణ పేరును తమ గోల్డ్ ఎడిషన్లో చేర్చింది. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నటుడిగా బాలకృష్ణ చరిత్రలో నిలిచారు.
ఇకపోతే, సినిమా ప్రయాణంతో పాటు ఆయన చేస్తున్న సామాజిక సేవలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది. ముఖ్యంగా గత 15 సంవత్సరాలుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా ప్రజలకు చేస్తున్న సేవలకు ఇది మరింత విలువ చేకూర్చింది. ఇటీవలే, ఏప్రిల్ 2025లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించడం మరో విశేషం.
కాగా, ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ షూటింగ్లో బిజీగా ఉండగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కూడా సిద్ధమవుతోంది. అభిమానులు త్వరలోనే కొత్త అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
