ఏపీకి అల‌ర్ట్..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలకు వర్షాలు పడుతున్నాయి. ఈ అల్పపీడనం ఆదివారం నాటికి జార్ఖండ్‌కు చేరుకుని బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈ నెల 25వ తేదీన ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని వాయువ్య బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ కొత్త అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 26వ తేదీ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా, శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండ, ఉక్కపోత కొనసాగింది. బాపట్లలో అత్యధికంగా 36.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం బలపడితే వర్షాలు మరింత పెరుగుతాయని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply