ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని చమోలీ జిల్లా (Chamoli District)లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కురిసిన భారీ వర్షాల కారణంగా మరోసారి మెరుపు వరదలు (floods) సంభవించాయి. దీనితో అనేక నివాసాలు, రహదారులు జలమయం అయ్యాయి. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. సగ్వారా గ్రామంలో ఒక యువతి వరద శిథిలాల కింద చిక్కుకుపోయి మరణించింది. ఇంకా, అనేక మంది గల్లంతైనట్లు సమాచారం.

ఈ క్లౌడ్ బరస్ట్ (Cloudburst) సమాచారం అందిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు (Assistive measures) చేపట్టాయి. ఇళ్లలో చిక్కుకున్న ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు (Safe areas) తరలిస్తున్నాయి. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి సాయం అందిస్తున్నాయి.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ ద్వారా స్పందించారు. స్థానిక యంత్రాంగంతో మాట్లాడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆయన ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం, సహాయక బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. అలాగే, స్థానిక ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. ఈ క్లౌడ్‌బర్స్ట్ ఉత్తరాఖండ్‌లో రుతుపవనాల సమయంలో సంభవించే సహజ విపత్తులలో ఒకటి. ఈ ఘటన చాలా మంది ప్రాణాలకు, ఆస్తులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించింది.

Leave a Reply