సినిమాలకు మాటలు రాయడమంటే మాటలు కాదు. అందునా పౌరాణిక పాత్రలకు సంభాషణలు సమకూర్చడం కత్తిమీద సాము లాంటిది. ఎందుకంటే ప్రతి పౌరాణిక పాత్రమీదా ప్రేక్షకులకు ఒక అంచనా, అవగాహనా ఉంటాయి. అవి అప్పటిదాకా చూసిన సినిమాల ద్వారా కావచ్చు, సీరియల్స్ ద్వారా కావచ్చు. చిన్నప్పటి నుంచి చూసిన క్లాలెండర్ల ద్వారానూ కావచ్చు.
వాటికి కాస్త భిన్నంగా కనిపించినా, వినిపించినా ఒప్పుకోరు ప్రేక్షకులు. ఇటీవల విడుదలై ప్రేక్షకుల చేత నీరాజనాలందుకుంటున్న మహావతార్ యానిమేటెడ్ మూవీ సక్సెస్ లో డైలాగులు ముఖ్యపాత్ర వహించాయి. ఒక్కో డైలాగ్ తెరమీద విజువల్ తో పోటీ పడుతోంటే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ప్రేక్షకులు ఏకంగా సీట్లలోంచి లేచి సాష్టాంగ ప్రణామాలు చేసారు…చేతులెత్తి దండం పెట్టారు.
అంతటి భక్తిభావాన్ని రేకెత్తించిన ఆ చిత్ర రచయిత శ్రీనివాస వెంకటేశన్ ఆంధ్రప్రభతో ముచ్చటించారు. అనేక విషయాలు వివరించారు. అలాంటి జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి…సినిమా రచయితగా ఎలా ఎదిగారు? ప్రత్యేకించి యానిమేటెడ్ చిత్రాలకు స్క్రిప్ట్ లు అందించేప్పుడు ఎదురయ్యే సవాళ్ళేమిటి? ఇలా ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు చెప్పారు. ఆ విశేషాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈ క్రింది లింక్ లో చూసెయ్యండి మరి.