ట్రంప్.. పొరవాటు అదేనా?

అయితే…ఇప్పటిదాకా ప్రపంచ దేశాలకు ప్లాన్ ఏ(Plan A) గా ఉన్న అమెరికా కాస్తా ఇప్పుడు ప్లాన్ బీ(Plan B) గా మారింది. టారిఫ్ లు పెంచేసి, నిబంధనలు కఠిన తరం చేసినంతమాత్రాన అందరూ మౌనంగా భరిస్తారనుకోవడం ట్రంప్ చేసిన పెద్ద పొరపాటు. ప్రపంచ దేశాలను (countries of the world) ట్రంప్ చాలా తక్కువ/తప్పు అంచనా వేసారు. భారత్ తో సహా దేశాలన్నీ విద్య/వ్యాపార (Education/Trade) అవకాశాల కోసం ప్రత్యామ్నాయ దేశాలను వెతికే పనిలో పడ్డాయి. ఇదే అదనుగా మిగతా దేశాలు కూడా తమదేశాలతో ఇతర దేశాలకు ప్రయోజనాలను చూపి సంబంధాలను మెరుగుపర్చుకుంటున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా మిత్ర దేశాలు, అమెరికా బాధిత దేశాలుగా విడిపోయాయి. ఉదాహరణకు భారత్ తన వాణిజ్య అవసరాలకు అమెరికా (America) వైపు చూడకుండా చైనా, రష్యా(China, Russia) లవపు దృష్టి మరల్చింది. ట్రంప్ చేస్తున్న పెద్ద తప్పిదం ఇది. ప్రపంచ దేశాలతో వ్యాపార వాణిజ్య సంబంధాలను (Business Trade Relations) ఒక్కసారి కోల్ఫొతే తిరిగి కూడగట్టుకోవడం ఎంత కష్టమో ఆలోచించడం లేదు. ట్రంప్ టర్మ్ అయిపోయేలోపు ప్రపంచ దేశాలన్నీ ఎక్కడికక్కడ అమెరికాను పక్కన పెట్టి తమలో తాము వాణిజ్య సంబంధాలను మెరుగు పర్చుకుంటే మళ్ళీ తమవైపు తిప్పుకోవడం తర్వాత వచ్చే పాలకులకు చాలా కష్టమవుతుంది. అంత పెద్ద దేశాధినేత పాలకుడి ఆలోచనలు, ప్రణాళికలు ఎలా ఉండాలి? సుదీర్ఘ ప్రయోజనాలను కాపాడాలి కదా? మరి ఇప్పుడే ఇలా నవ్వులపాలైతే ఎలా? అని సాక్షాత్తూ అమెరికన్లే కంగారు పడుతున్నారు. చూద్దాం. ట్రంపు విచిత్ర విన్యాసాల పర్యవసానాలు మరేం చేయబోతున్నాయో..!

Leave a Reply