పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా హరి హర వీర మల్లుం (Hari Hara Veera Mallu), జ్యోతికృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

ఇదిలా ఉండగా, ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. హరి హర వీర మల్లు రేపటి నుండి (ఆగస్టు 20) అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ భాషలలో ఆడియో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంటుంది. అయితే, హిందీ, కన్నడ వెర్షన్ల గురించి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మించిన‌ ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, సచిన్ ఖేడేకర్, రఘుబాబు, సుబ్బరాజు, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Leave a Reply