విజ‌య‌వాడ : ఘుమఘుమలాడుతూ ఆహారపదార్థాలు…అందంగా డిస్ ప్లే చేసిన హోటళ్ళ నిర్వాహకులు (Hotel managers)… లొట్టలు వేసుకుంటూ ఆరగించేస్తున్న ఆహార ప్రియులు. అసలు కథ ఆ హోటళ్ళ లోపలకెళ్ళి కిచెన్లలో చూస్తే బట్టబయలవుతుంది. అన్నీ కుళ్ళిన, నిల్వ ఉంచిన పదార్థాలు.

విజయవాడ (Vijayawada) లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడిన విస్తుపోయే నిజాలు. అయితే, తరచూ ఇలాంటి వార్తలు వినవస్తున్నా, హోటళ్ళ యజమానుల్లో (hotel owners) ఏమాత్రం మార్పు కానరావడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం మానటం లేదు.

చాలాచోట్ల బేకరీల్లో (bakeries) నాణ్యత లోపించిన కేకులు, ఫ్రిజ్జుల్లో రోజుల తరబడి దాచిన పదార్థాలు, పాడైపోయిన పాస్త్రీలు ఇలా అనేకం దర్శనమిచ్చాయి. పలు హోటళ్ళను, బేకరీలను సీజ్ చేసారు అధికారులు.

Leave a Reply