భద్రాచలం (భద్రాద్రి కొత్తగూడం జిల్లా) : మహరాష్ట్రతోపాటు రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి నది శాంతించింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు భద్రాచలం వద్ద గోదావరి నదిలో 36.20 నీటి మట్టానికి చేరుకుంది. నిన్నసాయంత్రం 38 అడుగుల నీటి ప్రవహం ఉండేది. గోదావరి నదిలో నీటి మట్టం తగ్గడంతో నదీ తీరా ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం 6,25,999 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుందని అధికారులు తెలిపారు.
Godavari calmed down శాంతించిన గోదావరి
