జాగ్రత్తలు సూచిస్తున్న పోలీసులు..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సైబర్ నేరగాళ్లు (Cyber criminals) రూట్ మార్చుతున్నారు. ఇప్పుడు కొత్తగా ‘రీఫండ్ క్యాష్ బ్యాక్’ (Refund Cash Back)పేరుతో డబ్బులను కొట్టేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ (APK files) ను పంపించి బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే వాటిలో ఈ తరహా మోసాలపై 80 శాతం ఫిర్యాదులు ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్) చెల్లింపుల్లో ప్రపంచం లోనే భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రతినెలా రూ.1800 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని ఇంటర్ నేషనల్ మానిటరీ ఫం డ్(ఎంఎంఎఫ్) సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచంలో రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో నూ 50శాతం ఒక్క మన దేశంలోనే కొనసాగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇంత పెద్దమొత్తంలో లావాదేవీలు జరుతున్నందు వల్లే సైబర్ నేరగాళ్లు భారత్ ను ఎంచుకుంటున్నట్లు తెలుస్తున్నది.
జంప్ డిపాజిట్ ఏమిటి..?
యూపీఐ యాప్ లో డబ్బులు వచ్చాయని మెసేజ్ వస్తుంది. మనం చెక్ చేసుకోగానే మన బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది. వాస్తవానికి వాళ్లు పంపించేది మనీ రిక్వెస్ట్ మెసేజ్ మాత్రమేనని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. ఇలా డబ్బుల వచ్చాయని మెసేజ్ లేదా సూచనలు రాగానే బ్యాలెన్స్ చెక్ చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. బ్యాలెన్స్ చెకింగ్ కోసం యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే పలు డబ్బులు మన ఖాతాలో నుంచి అవతలి వ్యక్తులకు పోతాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలపై ఇప్పటికే ఫిర్యాదులు అందినట్లు సైబర్ బ్యూరో అధికారులు వెల్లడించారు. గోల్డెన్ అవర్ చాలా ముఖ్యం సైబర్ క్రైమ్ లో మోసపోయిన వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరోను సంప్రదించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా లావాదేవీలో మోసం జరిగిందని భావిస్తే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాల ని చెబుతున్నారు. గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యమని, ఫిర్యాదు వెంటనే చేసినట్లయితే లావాదేవీలు జరిగిన అకౌంట్లు గుర్తించి వెంటనే ఫ్రీజ్ చేయొచ్చని సైబర్ బ్యూరో వెల్లడించింది.
కంబోడియా వేదికగా.. సైబర్ క్రైమ్ నేరాల్లో 70శాతం కంబోడియా వేదికగా జరుగుతున్నాయని, తర్వాత దుబాయి, చైనా దేశాల్లో జరుగుతున్నట్లు నేషనల్ సైబర్ క్రైమ్ గుర్తించింది. సైబర్ నేరగాళ్లు విదేశాల నుంచి ఏపీకే ఫైల్స్ ను పంపిస్తూ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ట్రెడింగ్ యాప్ పెట్టుబడి మోసాలు, లోన్ యాప్ ఇంకా పలు విధాలుగా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తర హాలోనే ఇప్పుడు కొత్తగా జంప్ డిపాజిట్ (Jump Deposit fraud) చేరింది. మనీ రిక్వెస్ట్ యూపీఐకి మెసేజ్ పంపించి డబ్బును లూటీ చేస్తున్నారు. ఈ తరహా మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.