కడప జిల్లాలోని ఒంటిమిట్ట (Ontimitta) జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం (TDP Victory) సాధించింది. హోరాహోరీగా సాగిన పోటీలో టీడీపీ అభ్యర్థి అడ్డలూరు ముద్దుకృష్ణారెడ్డి (Muddukrishna Reddy), వైసీపీ (YCP) అభ్యర్థి కె.సుబ్బారెడ్డి (K. Subba Reddy) పై 3,105 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
మొదటి రౌండ్ నుంచే ఆధిక్యంలో కొనసాగిన ముద్దుకృష్ణారెడ్డి, చివరి వరకు ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. పోలింగ్ రోజు ఘర్షణలు, ఉద్రిక్తతల మధ్య గట్టిగా పోరాడిన రెండు పార్టీలలో, టీడీపీ (TDP) చివరకు విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం స్థానికంగా పార్టీ కేడర్ కి ఉత్సాహాన్ని నింపింది.
రాష్ట్రవ్యాప్తంగా కూటమి శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వైసీపీ బలమైన స్థావరంగా భావించే ప్రాంతంలో టీడీపీ గెలుపు (TDP win) సాధించటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా విజయోత్సవాలు జరిపారు.