కరీమాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రప్రభ) రాత్రి కురిసిన భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ (Mills Colony Police Station) ప్రాంతం ముంపునకు గురైంది. మిల్స్ కాలనీ సీఐ రమేష్, సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆ ప్రాంతంలో ఇళ్లల్లోకి నీరు రావడంతో చిన్నారులను సిఐ రమేష్ (CI Ramesh), ఎస్సై సురేష్ స్వయంగా వారిని ఆ ప్రాంతం నుండి తమ చేతులపై తీసుకొనివచ్చారు.
ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు అంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని మిల్స్ కాలనీ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బొల్లం రమేష్ సూచించారు. 32వ డివిజన్ లోని రామ్ లక్ష్మణ్ థియేటర్ (Ram Lakshman Theatre) ప్రహరి గోడ కూలిపోయింది. శివనగర్ లో ఇంట్లోకి నీరు రావడంతో చిన్నారుల తాతయ్య వారిని తీసుకొని సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. అండర్ బ్రిడ్జి (Underbridge) పూర్తిగా మునిగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలోని మైసయ్య నగర్, శివనగర్, చిన్న బ్రిడ్జి ప్రాంతం, డీకే నగర్ ప్రాంతాలు నీటమునిగాయి.
రైల్వే స్టేషన్ లోకి చేరిన వరద నీరు…
వరంగల్ (Warangal) రైల్వే స్టేషన్ లోకి వరద నీరు చేరడంతో పట్టాలు నీట మునిగిపోయాయి. సిబ్బంది పట్టాల మీది నీరు తొలగించేందుకు చర్యలు చేపట్టారు.