టీమిండియా వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గ్యారేజీలోకి మరో లగ్జరీ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. లగ్జరీ కార్ల దిగ్గజం లంబోర్గిని తయారు చేసిన ఉరుస్‌ మోడల్‌ను హిట్‌మ్యాన్‌ సొంతం చేసుకున్నాడు. ఈ విలాసవంతమైన ఈ సూపర్‌కార్‌ ఖరీదు ఏకంగా ₹4.57 కోట్లు!

కానీ… ఈ సూపర్‌కార్ కంటే ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నది దీని నంబర్‌ప్లేట్‌. రోహిత్‌ ఎంచుకున్న “3015” నంబర్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్ గా మారింది. అభిమానులు దీనిలో దాగిన అర్థం వెతకడం మొదలుపెట్టారు. చివరికి రహస్యం బయటపడింది –

  • 3 + 0 + 1 + 5 = 9
  • 30 + 15 = 45 → ఇది రోహిత్‌ జెర్సీ నంబర్‌.

ఫ్యామిలీ కనెక్షన్ కూడా ఉంది!

ఈ నంబర్ వెనక మరో అర్థం కూడా ఉంది. రోహిత్‌ కుమార్తె సమైరా పుట్టినరోజు డిసెంబర్‌ 30, కుమారుడు అహాన్ పుట్టినరోజు నవంబర్‌ 15. ఈ రెండు తేదీలను కలిపి 3015 గా నంబర్‌ తీసుకున్నారని అభిమానులు చెబుతున్నారు. ఇంతకుముందు రోహిత్‌ వాడిన కార్‌ నంబర్‌ 264, ఇది వన్డేల్లో ఆయన సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆడతాడా?

ఇక‌, చివరిసారిగా ఛాంపియన్స్‌ ట్రోఫీలో బరిలోకి దిగిన రోహిత్‌, ఇప్పుడు మ‌రో రెండు నెలల తర్వాత జరగబోయే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఆడతారా అన్నది క్రికెట్‌ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే టీ20, టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్‌, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.

2027 వన్డే వరల్డ్‌కప్‌ను లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్‌కు మేనేజ్‌మెంట్‌ దేశవాళీ క్రికెట్‌ కూడా ఆడాలని సూచించింది. ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply