కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర సహకార శాఖ మంత్రి కె.ఎన్. రాజన్న వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్‌పై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై రాజన్న ప్రశ్నలు లేవనెత్తడంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడింది.

కర్ణాటక రాజకీయాల్లో (Karnataka Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్నాటక సహకార మంత్రి, ముఖ్యమంత్రి మద్దతుదారుడైన కేఎన్‌ రాజన్న (KN Rajanna) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ ఆరోపణల విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎన్నికల కమిషన్ పై చేసిన ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలు చేయగా రాజన్న చేసిన కామెంట్స్ ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది.

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అంగీకరిస్తూనే, తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటర్ల జాబితా (Voters List) తయారైందని, అప్పుడు పార్టీ ఎందుకు నిశ్శబ్దంగా ఉందని రాజన్న ప్రశ్నించారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో పార్టీ విఫలమైందని విమర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం (Congress leadership) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అధిష్టానం సూచన మేరకు ఆయన మంత్రి పదవికి రాజీనామా (Resignation) చేశారు.

కాగా గతంలో కూడా కె.ఎన్.రాజన్న వివిధ సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు (Controversial comments) చేసి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా, తన వయస్సు, ఆరోగ్య కారణాల వల్ల తాను తదుపరి ఎన్నికల్లో పోటీ చేయబోనని, కానీ రాజకీయాల్లో మాత్రం చురుకుగా ఉంటానని ప్రకటించారు. అలాగే, కాంగ్రెస్ అధిష్టానం (Congress leadership) పై కూడా గతంలో విమర్శలు చేశారు. సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని పెద్ద రాజకీయ మార్పులు ఉండవచ్చని అంటూ ఇటీవల రాజన్న చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Leave a Reply