పిల్లలను ఒత్తిడికి గురిచేయవద్దు..!

  • క్షణికావేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు..
  • పొరపాటు ఎక్కడుందో గ్రహించకపోతే తీవ్ర నష్టమే..!


సమకాలీన సమాజంలో విద్యార్థులు ఆత్మహత్యల (Students commit suicide)కు పాల్పడటం ఆందోళన కలిగించే అంశం. ఈ దురదృష్టకర సంఘటనల వెనుక ముఖ్యంగా విద్యాపరమైన ఒత్తిడి (stress), కుటుంబ అంచనాలు, సామాజిక పోలికలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. తల్లిదండ్రులు (parents) తమ పిల్లలను ఇతరులతో పోల్చడం, అధిక మార్కుల (High marks) కోసం ఒత్తిడి చేయడం, వారి ఇష్టాలకు వ్యతిరేకంగా నిర్దిష్ట కోర్సులను ఎంచుకోమని బలవంతం చేయడం వంటివి పిల్లల మానసిక ఆరోగ్యం (Children’s mental health)పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ఈ ఒత్తిడిని తట్టుకోలేక, క్షణికావేశంలో పిల్లలు తమ జీవితాలను ముగించుకుంటున్నారు. ఈ సమస్యను నివారించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం అందరూ కలసి కృషి చేయాలి. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవడం, వారి భయాలను, ఆందోళనలను వినడం, వారికి మద్దతుగా నిలబడటం చాలా ముఖ్యం. పరీక్షలలో మార్కులు మాత్రమే వారి భవిష్యత్తును నిర్ణయించవని తల్లిదండ్రులు గుర్తించాలి.

ఈ మధ్య చదువు ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యల (suicide) పాలవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి. సాధారణంగా పదో తరగతి(10th class) పూర్తయిన విద్యార్థి ఆ తర్వాత నచ్చిన కోర్సు (Course of choice)ను చేయాలని అనుకుంటారు, కానీ పిల్లలకు నచ్చిన సబ్జెక్ట్ కాకుండా వేరే ఎవరో చెప్పారని, వాళ్లకు అతి తక్కువ సమయంలోనే ఉద్యోగం వచ్చి లక్షలు, లక్షలు సంపాదిస్తున్నారని అదే బాటలో తమ పిల్లలు కూడా ఉండాలని తల్లిదండ్రులు ఇష్టంలేని కోర్సులలో పిల్లలను చేర్చిస్తుంటారు. కానీ ఆ పిల్లలు తమకు ఇష్టంలేని కోర్సు తీసుకుని అది అర్థం కాక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోయే వాళ్లు కోకొల్లలుగా ఉన్నారు. అందులో కొంతమంది ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

అందుకే పాఠశాల స్థాయిలోనే ఈ కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. టెన్త్ తర్వాత ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏ కోర్సు చేస్తే ఎలాంటి ఉద్యోగాలు సాధించేందుకు అవకాశాలు ఉన్నాయనే ప్రతి విషయాన్ని వారికి వివరిస్తే ఉపయోగం ఉంటుంది. ఇక చదువుపై ఆసక్తి లేని విద్యార్థులకు ఓపెన్ స్కూల్ (Open School) గురించి అవగాహన తెప్పించి వాళ్లకు ఇష్టమైన రంగం (Favorite field)లో మెళకువలను నేర్పితే బాగుంటుంది. ఇందులో ఉపాధ్యాయుల పాత్ర (Role of teachers) కూడా కీలకం. ఎందుకంటే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి.

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి మార్కులు రావాలని కోరుకుంటారు. అయితే, మార్కులతో పాటు జ్ఞానం ఎంత ఉంది, సమాజంపై పట్టుందా..? అన్ని విషయాలు కరెక్ట్ తెలుస్తున్నాయా..? అనే విషయాలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. ఒక సబ్జెక్ట్ గురించి క్షుణ్ణంగా తెలిస్తే అదే గొప్ప విషయం అనుకోవాలి. అంతేకానీ మార్కులు తక్కువ వచ్చాయని పిల్లలను ఇబ్బందులు పెట్టకుండా నాలెడ్జ్ పెంచుకునేలా ప్రోత్సాహం అందిస్తే అన్ని విధాల బాగుంటుంది. బట్టీ పట్టే విధానానికి పుల్ స్టాప్ పెట్టి, నాలెడ్జ్ ను పెంచుకునే విధానం వైపు పయనం సాగితే అత్యుత్తమ ఫలితాలు రావడంతో పాటు మంచి జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ విషయంలో ప్రతి తల్లిదండ్రులు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

పిల్లలు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు, వారికి కౌన్సెలింగ్ Counseling), మానసిక మద్దతు (Psychological support) లభించేలా చూడాలి. విద్యార్థుల్లో ఆత్మహత్యలకు దారితీసే కారణాలను గుర్తించి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వాలు, విద్యాసంస్థలు (Educational institutions) ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. విద్యార్థులు భయం లేకుండా తమ మనసులోని మాటను వ్యక్తం చేసే వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే మనం భవిష్యత్తు తరాలను కాపాడుకోగలుగుతాం.

ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు..

= విద్యార్థుల వసతి గృహాలను మూడు పూటల తనిఖీ చేయాలి. బాలికల వసతి గృహాల్లో పర్యవేక్షకుల సంఖ్య పెంచి నిరంతరం నిఘా పెట్టాలి.
= హాస్టల్‌ గదుల్లో విద్యార్థినులను ఒంటరిగా ఉండనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
= ప్రధానంగా తీసుకోవాల్సిన చర్య ఏంటంటే సీలింగ్‌ ఫ్యాన్లను తొలగించి వాటికి బదులుగా పెడస్టర్‌, గోడ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలి.
= కౌన్సెలింగ్‌ ఇచ్చేవారి సంఖ్య పెంచాలి.
= విద్యార్థులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారిని తరచూ పలకరించాలి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలి. కాస్త కలివిడిగా మాట్లాడి మనోధైర్యాన్ని నింపాలి.
= విద్యార్థి తల్లిదండ్రులతో అధ్యాపకులు సత్సంబంధాలు కలిగి ఉండాలి. పిల్లల వ్యక్తిగత సమస్యలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లే వ్యవస్థ ఉంటే మేలు.

Leave a Reply