ఫోన్ ట్యాపింగ్‌పై తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధమా..?

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) పై సంచలన ఆరోపణలు చేశారు. నా ఫోన్‌ను కేటీఆరే ట్యాప్ చేయించారని నాకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ (phone tapping) పై తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధం.. ప్రమాణానికి కేటీఆర్ సిద్ధమా..? అని సంజయ్ సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. సొంత పార్టీ నేతలపైనే కేటీఆర్ కు నమ్మకం లేదు. కేటీఆర్ నోటీసులకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసన్న సంజయ్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మీ చెల్లెనే చెప్పింది..
కేటీఅర్ చెల్లె కవిత (KTR’s sister Kavitha)నే తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్పింది. కేటీఆర్ నోటీసులు పంపితే నేను చట్టపరంగా సమాధానం ఇస్తాను. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బెదిరిస్తే బెదిరే వ్యక్తిని కాను. మా నాన్న పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాను. సిట్ అధికారులకు నా దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చా. సిట్ అధికారులు (CIT officials) నిజాయితీ పరులు. కానీ, పరిమితులు తక్కువగా ఉన్నాయని సంజయ్ అన్నారు. ప్రభాకర్ రావు ఐజీ అని తప్పుడు సమాచారం కేంద్రానికి ఇచ్చారని అన్నారు.

కేటీఆర్ లాగా కొంపలు ముంచె తెలివి నాకు లేదు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయిందని రేవంత్ రెడ్డిని విచారణకు పిలుస్తారా..? కేటీఆర్ లాగా కొంపలు ముంచె తెలివి నాకు తెలియదు. ఎస్ఐబీ దేనికోసం పనిచేయాలి.. కేవలం మావోయిస్టుల కోసం పని చేయాలి. సినిమా యాక్టర్ ఫోన్లు విని బ్లాక్ మెయిల్ చేశారు. బెంగాల్‌కి పోయి మమతా బెనర్జీకి డబ్బులు ఇచ్చింది వాస్తవం కాదా.. ముంబయికి పోయి డబ్బులు ఇవ్వలేదా..? అని సంజయ్ ప్రశ్నించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్త్ మేరా దోస్త్‌..
కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష‌ అని స్నేహంలో ఉన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలని బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఆ పార్టీని వదిలేసి బయటకు రావాలని సంజయ్ అన్నారు. కాళేశ్వరం రిపోర్టు వచ్చాక చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు.

Leave a Reply