నష్టాల బాట పట్టిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు..


దేశీయ స్టాక్‌ మార్కెట్ల (Domestic stock markets), పై టారిఫ్‌ భయాలు పెనుముప్పుగా మారాయి. సుంకాలపై ఎటువంటి వాణిజ్య చర్చలు జరగబోవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (US President Donald Trump) చేసిన వ్యాఖ్యలు పెట్టుబడిదారుల భావోద్వేగాలను దెబ్బతీశాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

సుంకాలపై వాణిజ్య చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించింది. అటు అంతర్జాతీయ పరిణామాలు (International developments) సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ (Sensex) 300 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ (Nifty) 24,600 మార్క్‌ కోల్పోయింది.

ఉదయం సమయంలో సెన్సెక్స్ (Sensex) 305.11 పాయింట్లు పడిపోయి 80,318.15 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ (Nifty) 79.2 పాయింట్ల నష్టంతో 24,516.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్ (Dollar) తో రూపాయి మారకం విలువ 2 పైసలు తగ్గి 87.60గా కొనసాగుతోంది. నిఫ్టీలో ట్రెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్టీపీసీ, హీరో మోటార్స్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు రాణిస్తున్నాయి. భారతీయ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

Leave a Reply