ఐదు టెస్టు (five Tests)లో ఇంగ్లాండ్ (England) పై విజయంతో భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 (World Test Championship 2025-27)లో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఒక్క స్థానాన్ని ఎగబాకి 3వ స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ కంటే ముందు భారత్ (India) 4వ స్థానంలో ఉండేది. ఇంగ్లాండ్ ఒక్క స్థానం కోల్పోయి 4వ స్థానానికి పడిపోయింది. డబ్ల్యూటీసీ సర్కిల్లో ఇరు జట్లకు ఇదే మొదటి సిరీస్. ఐదు టెస్టుల్లో ఇరు జట్లు చెరో రెండు విజయాలు, రెండు ఓటములు పొందాయి.

ఓ మ్యాచ్ ను డ్రా చేసుకున్నాయి. భారత్ 28 పాయింట్లు, 46.67 పర్సెంటేజ్ మూడో స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ 26 పాయింట్లు, 43.33 పర్సెంటేజ్ 4వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (36 పాయింట్లు, 100 పర్సంటేజ్ ) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శ్రీలంక (16 పాయింట్లు, 66.67 పర్సెంటేజ్) రెండో స్థానంలో ఉంది.

Leave a Reply