న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ(Anil Ambani)కి ఈడీ (ED) భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల ED అనిల్ అంబానీ ఇంట్లో దాడులు చేసింది. రూ.3,000 కోట్ల లోన్ మోసం కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి అనిల్‌ను (ఆగస్టు 5న) ఈ మంగళవారం విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసు (Notice) జారీ చేసింది. ఇప్పటికే జూలై 24న ప్రారంభమైన ఈ దాడుల్లో, మూడు రోజులలో పదికి పైగా నగరాల్లో 50కి పైగా సంబంధిత కంపెనీలపై ED సోదాలు నిర్వహించింది.

2017 – 2019 మధ్య యస్ బ్యాంక్ రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు మంజూరు చేసిన రూ. 3,000 కోట్ల రుణాలను అనుమానాస్పదంగా వినియోగించినట్లు ED కనుగొంది. రుణాలు మంజూరు చేయడానికి ముందు బ్యాంక్ ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగాయని, ఇది quid pro quo (ప్రత్యుపకారం) పద్ధతిగా అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply