తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనమయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరగా, శనివారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా, ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరగనున్న న్యాయ సదస్సులో సీఎం పాల్గొననున్నారు. ఈ సదస్సును ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఇందులో మానవ హక్కులు, సమాచార హక్కు చట్టం (RTI) వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
సదస్సుకు ఎఐసీసీ ప్రముఖ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. ముఖ్యంగా, ఈ సదస్సును రాజ్యసభ సభ్యుడు డా. అభిషేక్ మనుసింగ్వీ నేతృత్వంలో నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా న్యాయపరంగా ఎదురవుతున్న సవాళ్లు, ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలపై కీలక చర్చలు జరగనున్నట్లు సమాచారం.
సదస్సు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రంలో జరుగనున్న ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో, ఆయన ఆగస్టు 4న తిరిగి రాష్ట్ర ప్రజల ముందుకు రానున్నారు.