Big Breaking | ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

మూడు నెలల్లో తేల్చాలని స్పీకర్ కు ఆదేశాలు


ఢిల్లీ : తెలంగాణ (Telangana)లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. వారిపై అనర్హత వేటు (Disqualification) పడుతుందా.. సుప్రీంకోర్టు (Supreme Court) ఏ తీర్పు ఇవ్వనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇవాళ‌ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీ (Congress party) కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేల భవితవ్యం మూడు నెలల్లో తేల్చాలని స్పీకర్ (Speaker) కు ఆదేశాలు జారీ చేసింది.

2023లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ లు కొంతకాలం తరువాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. అయినా, స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Leave a Reply