Nandyala |గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20మందికి అస్వస్థత

నంద్యాల బ్యూరో, జులై 26 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా (Nandyal District) పాణ్యం మండల పరిధిలో ఉన్న నేరవాడ గురుకుల పాఠశాల (Neravada Gurukul School)లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ (Food poisoning) అయిన సంఘటన చోటుచేసుకుంది. 20మంది విద్యార్థులు రాత్రి నుండి తీవ్ర వాంతులు, విరేచనాలతో అల్లాడుతున్న విద్యార్థులను ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. కొందరు విద్యార్థుల‌ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. విద్యార్థులను పాణ్యం డీఎస్ హెచ్ హాస్పిటల్ (Panyam DSH Hospital) లో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.

విద్యార్థుల ఫుట్ పాయిజన్ ఘటనపై జిల్లా కలెక్టర్ రాజకుమారి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే సంబంధిత అధికారులను హాస్టల్ కు పంపించి పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఘ‌ట‌న‌పై పర్యవేక్షిస్తూ నివేదికను కలెక్టర్ కు ఇస్తున్నట్లు తెలిపారు. ఈఘ‌ట‌న‌పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply