- 264/4 వద్ద నిలిచిన మ్యాచ్
మాంచెస్టర్, ఇంగ్లాండ్ : ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నేడు ప్రారంభమైన నాల్గో టెస్టులో ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. తొలి రోజు ముగిసేసరికి భారత్ మంచి స్కోర్ ను సాధించింది. భారతదేశం సహేతుకమైన స్కోరును సాధించింది. కీలక నాలుగో టెస్ట్ తొలి రోజు భారత్ 264/4 స్కోరు చేసి నిలదొక్కుకుంది.
ఓపెనర్లు కెఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58) 94 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ బౌలర్లను ఇబ్బందిపెట్టారు. అయితే, రిషబ్ పంత్ గాయం శిబిరంలో ఆందోళన కలిగించింది.
లంచ్ తర్వాత మ్యాచ్ మోమెంటం మారింది. క్రిస్ వోక్స్ రాహుల్‌ను అవుట్ చేసి బ్రేక్‌త్రూ అందించగా.. టెస్ట్‌కి తిరిగి వచ్చిన లియామ్ డాసన్, జైస్వాల్‌ను వెనక్కు పంపాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా స్టోక్స్ ధాటికి నిలవలేక 12 పరుగులకే వెనుదిరిగాడు.దీంతో భారత్ 140 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత రంగంలోకి దిగిన సాయి సుధర్శన్ (61) పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. తన రెండో టెస్ట్‌నే అయినా సుధర్శన్ కూల్‌గా ఆడుతూ పర్ఫెక్ట్ హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్‌కి జీవం పోసాడు.
పంత్ గాయం కారణంగా సుదర్శన్-పంత్ భాగస్వామ్యం తెగిపోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నిస్తుండగా… బంతి పంత్ కాలును బలంగా తాకింది. LBW నుండి తప్పించుకున్నప్పటికీ, గాయం కారణంగా క్రీజులోకి తిరిగి రాలేదు. తీవ్రమైన కాలి గాయం కారణంగా పంత్ క్రీజును విడిచిపెట్టి అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్లాడు. దీంతో మ్యాచ్‌లో అతను ఆడటం అనుమానాస్పదం అయ్యింది.
తరువాత సుధర్శన్ కూడా స్టోక్స్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో భారత్ 235/4కి పడిపోయింది. చివరగా రవీంద్ర జడేజా (19)– శార్దూల్ ఠాకూర్ (19) జాగ్రత్తగా ఆట ముగింపు వరకు నిలిచారు. వెలుతురు తగ్గిపోవడం వల్ల ఆట కాస్త ముందుగానే ఆపేశారు.
ఇంగ్లాండ్ తరఫున స్టోక్స్ రెండు కీలక వికెట్లు పడగొట్టగా, డాసన్, వోక్స్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
మొదటి రోజు భారత్ స్కోరు బాగున్నప్పటికీ.. పంత్ గాయం ఇప్పుడు జట్టుకి పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు డే 2లో మిగతా భారత్ బ్యాటర్లు ఎలా రాణిస్తారు, పంత్ ఆరోగ్య వివరాలు ఏం చెబుతాయో అన్నదే కీలకం..

