మాంచెస్టర్ : ఇంగ్లాండ్(England)తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మొదటి రోజు భారత్(India)కు శుభారంభం దక్కంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇక బరిలోకి దిగిన ఓపెనర్లు కెఎల్ రాహుల్ (40) – యశస్వి జైస్వాల్ (36) అద్భుతమైన భాగస్వామ్యం (Opening partnership) నెలకొల్పడంతో భారత్ వికెట్ కోల్పోకుండా 78/0తో లంచ్ సమయాని(Lunch break)కి చేరుకుంది.
సెషన్ (Session 1) ముగిసే వరకు జైస్వాల్-రాహుల్ జోడీ ఇంగ్లాండ్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. పిచ్ కొంచెం సాఫీగా మారడంతో ఈ జోడీ మరింత దృఢంగా నిలిచింది. కాగా, మాంచెస్టర్ వేదికపై.. టెస్టుల్లో భారత్కు ఇది మూడో 50+ ఓపెనింగ్ స్టాండ్ కావడం విషేశం.
లంచ్ సమయంలో ఇంగ్లాండ్ తమ ప్రణాళికలను సమీక్షించుకుని, ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి మెరుగైన వ్యూహాలతో తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు, భారతదేశం ఈ బలమైన ప్రారంభాన్ని విస్తరించి, ఆటలో ఎక్కువ సమయం నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో భారత్ తరపున అత్యధికంగా 50+ ఓపెనింగ్ భాగస్వామ్యాలు:
5 – విజయ్ మర్చంట్ – సయ్యద్ ముష్తాక్ అలీ, 1936-46
3 – సునీల్ గవాస్కర్ – చేతన్ శర్మ, 1979
3 – సునీల్ గవాస్కర్ – కృష్ణమాచారి శ్రీకాంత్, 1986
3 – కెఎల్ రాహుల్ – రోహిత్ శర్మ, 2021
3 – కెఎల్ రాహుల్ – యశస్వి జైస్వాల్, 2025, ఈ సిరీస్*

