Accident స్కూటీతో సహా బావిలో పడ్డ విద్యార్థి – స్పాట్ లో డెడ్

దండేపల్లి, జులై20(ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా లక్షేటిపేట పట్టణానికి చెందిన రుద్ర వంశీకృష్ణ(17)ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధి స్కూటీ అదుపు తప్పి బావిలో పడి మృతి చెందాడు, మృతుని తల్లి,దండేపల్లి ఎస్సై తహసినోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వంశీకృష్ణ,మరో నలుగురు స్నేహితులు కలిసి దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో పొలాలు చూడడానికి స్కూటీ పై వెళ్తుండగా ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో వెళ్తుండగా నంబల గ్రామ శివారులో రోడ్డు మీద ఉన్న మొరం కుప్ప కనిపించక పోవడంతో మొరం కుప్పను ఢీ కొట్టడంతో అదుపు తప్పి పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు,

ద్విచక్ర వాహనంపై అతనితో వెనకాల వస్తున్న అతని స్నేహితులు వెంటనే,మృతుని కుటుంబ సబ్యులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు అక్కడికి చేరుకొనే సరికి వంశీకృష్ణ బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు, మృతుని తల్లి రుద్ర నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply