హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తెంది. దీంతో ఆ విమాన సర్వీసును రద్దు చేశారు. తిరుపతికి వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఎస్జీ – 2138 విమానం రన్ వేపై వెళ్తుండగా పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే పైలట్ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో తిరుపతికి వెళ్లాల్సిన ఈ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు స్పైస్ జెట్ ఎయిర్ వేస్ అధికారులు ప్రకటించారు. ఈ విమానంలో తిరుపతికి వెళ్లాల్సిన 54 మంది ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరో విమానంలో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Shamshabad | స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం…తిరుపతి సర్వీస్ రద్దు


Pingback: WCL 2025| భారత్ - పాక్ ల మ్యాచ్ రద్దు - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Sto