Phone Tapping | బిఆర్ఎస్ నేత ప్ర‌వీణ్ కుమార్ సిట్ నోటీసులు

హైదరాబాద్, : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణలో భాగంగా మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ కు సిట్ అధికారులు నోటీసులు అందించారు. నోటీసు అందుకున్న రెండు రోజుల్లో ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల్లోపు వాగ్మూలం ఇచ్చేందుకు తమ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు.ఈ నెల‌ 14 న ప్రవీణ్ కుమార్‌కు సిట్ నోటీసులు ఇవ్వగా ఆయన ఇంకా స్పందించలేదు. గతంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో.. బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ను హ్యాక్ చేస్తుందని, ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘంతో డీజీపీకి ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు సిట్ నోటీసులు జారీ చేసింది.

Leave a Reply