ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమం..
నంద్యాల బ్యూరో, జులై 15 (ఆంధ్రప్రభ) : ఏదైనా గత కొన్ని సంవత్సరాలుగా పెన్షనర్లను అణగతొక్కుతున్న ప్రభుత్వం (Government) పై పెన్షనర్లు ఉద్యమబాట పట్టారు. రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల (Nandyala) తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం (BSNL Office) ముందు మంగళవారం పెన్షనర్లు ధర్నా చేపట్టారు. వందలాది మంది పెన్షనర్లు పాల్గొన్న ధర్నాలో మన అల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు డిమాండ్లను ప్రకటించారు.
పెన్షనర్ల డిమాండ్లు…
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో బాటు ప్రవేశపెట్టిన వేలిడేషన్ అమెండ్మెంట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సవరణ అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లు మాత్రమే కాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కూడా నష్టపోయే అవకాశం ఉందన్నారు.
ఈ ఫైనాన్స్ బిల్లును అమలు కాకుండా నిలువరించవలసిన అవసరం ఉందని అందుకు ఉద్యమమే శరణ్యం అని పేర్కొన్నారు.
కేంద్రంలో 8వ పే కమిషన్ వెంటనే నియమించాలని, ఏపీ రాష్ట్రంలో 12వ పే కమిషన్ నియమించి,తక్షణం ఐ ఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలు ,డిఆర్ బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు.
ఉద్యోగ పెన్షనర్లకు కాంప్రహెన్సువ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమును అమలు చేయాలన్నారు.
రైల్వే మరియు విమాన టికెట్లలో సీనియర్ సిటిజన్ రాయితీలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15సంవత్సరాల కాలం నుండి తగ్గించి 11 సంవత్సరాలు కు తగ్గించాలన్నారు.
పై డిమాండ్స్ దేశ వ్యాప్త అమలు చేయాలని ఈ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పుల్లారెడ్డి ప్రసాదరెడ్డి, సుబ్బారెడ్డి సుబ్బరాయుడు జయప్రకాష్ శ్రీనివాస్ రెడ్డి పురుషోత్తం రెడ్డి లక్ష్మీనారాయణ ఆనందు చెన్నకేశవులు జిల్లాలోని వివిధ తాలూకాలనుంచి వచ్చిన రిటైర్డ్ ఎన్జీవోస్ పెన్షనర్లు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.
రెండో దశలో సెప్టెంబర్ 17న ఢిల్లీలో ధర్నా..
ఈ డిమాండ్లు అమలు కాకపోతే రెండవ దశలో సెప్టెంబర్ 17వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వేలాది మంది పెన్షనర్లతో ధర్నా చేపడతామని పేర్కొన్నారు.